మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి కుటుంబాలకు సహాయం
కామారెడ్డి, 10 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, ఇసన్నపల్లి అనారోగ్యంతో మరణించిన గ్రామస్తుడు ఎర్రబాబు కుటుంబానికి రూ.2,000నగదు,50 కేజీలబియ్యం కామారెడ్డి నీటితోట్టిలో పడి మరణించిన చిన్నారు డు బుద్ధ రణవీర్ కుమార్ కుటుంబానికి రూ.3,000, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ గ్రామంలోనే జరిగిన అకాల మరణాలకు సంతాపం వ్యక్తం చేసిన మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబా ద్రి తన సొంత ఆర్థిక సహకారంతో కుటుంబాలను ఆదుకున్నారు.ఇసన్నపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల్లో దుర్భాగ్యకర ఘటనలు జరిగాయి. మొద ట, గ్రామానికి చెందిన ఎర్రబాబు అనారోగ్యంతో చనిపోవడం చాల బాదాకరం అన్నారు.అదే గ్రామా నికి చెందిన చిన్న పిల్లవాడు బుద్ధ రణవీర్ కుమార్ ఆడుకుంటూ కామారెడ్డి లో నీటితోట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది.ఈ సంఘటనలు గ్రామంలో భద్రతా చర్యల అవసరాన్ని తలెత్తించా యి. ముఖ్యంగా, నీటితోట్టిల పరిసరాల్లో రక్షణా చర్యలు, అనారో గ్యాలకు వైద్య సహాయం వంటి అంశాలపై గ్రామ ప్రజలు చర్చిస్తున్నారు. మాజీ సర్పంచ్ కందూరి పెద్ద లింబాద్రి మాట్లాడుతూ, గ్రామంలో ఎవరైనా కష్టాల్లో పడితే సహాయం చేయడమే నా బాధ్యత అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంశాల్లో సహకారం ముందుంటామని చెప్పారు.



