రాజంపేట ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గురువారం బోయినపల్లిలో అధికారులను హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు మేలు జరగాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో లాగా పథకాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.


