డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఇటీవల సంభవించిన బ్లోఔట్‌ను అతి తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నియంత్రించిన కంట్రోల్ టీమ్‌ను దుశ్శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించి, బ్లోఔట్ ప్రివెంటర్ (బీఓపీ)ను వేగంగా అమర్చి వెల్‌లోని ప్రమాదకర పరిస్థితిని పూర్తిగా నియంత్రించడం ద్వారా కంట్రోల్ టీమ్ తమ నైపుణ్యాన్ని నిరూపించింది. ఈ ఘటన వల్ల స్థానిక ప్రజలకు ఏర్పడిన ఆందోళన తొలగి, గ్రామంలో భద్రతా వాతావరణం నెలకొంది. ప్రజా భద్రతకు కట్టుబడి పనిచేసిన టీమ్ సేవలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసించారు.



