గన్నవరం : నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి)
గన్నవరం నియోజకవర్గంలోని ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రూ. 3.5లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామానికి చెందిన బేవర కుమారికి రెండు లక్షలు, గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన బుద్ధాల రామదాసు కు రూ. 1.5లక్షలు ఎల్ఓసి లను బుధవారం సాయంత్రం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో రోగుల కుటుంబ సభ్యులకు యార్లగడ్డ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గన్నవరం నియోజవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఎక్కువ మంది రోగులకు ఆర్థిక సాయం అందించినట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ వివరించారు.


