అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన కట్టడాలను ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు కూల్చివే శారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం, ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 80లో గ్యాప్ ఏరియా కింద ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఇది “ప్రభుత్వ భూమి” అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ మరుసటి రోజే అందులో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆ బోర్డులను తొలగిం చిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ ఇదే ప్రభుత్వ భూమిలో సుమారు 1000 గజాల వరకు స్థలాన్ని గురునా నక్ కాలేజ్ యాజమాన్యం ఆక్రమించి, అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. అందులో పిల్లర్స్ ను ఏర్పాటు చేయగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళ వారం ఉదయం జేసీబీతో కూల్చివేతలు చేశారు. ఈ కార్యక్ర మంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సువర్ణ, సర్వేయర్ సాయి కృష్ణ రెడ్డి, గ్రామ పాలన అధికారులు శ్రీనివాస్, రాజు, మణికు మార్, వీఆర్ఎ మహేష్ పాల్గొన్నారు.


