ఇకపై ట్రూకాలర్ వంటి యాప్‌ల అవసరం లేకుండానే ఇన్కమింగ్ కాల్ సమయంలోనే కాల్ చేస్తున్న వ్యక్తి పేరు మొబైల్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే, ఆ వ్యక్తి పేరు తెలుసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా, టెలికాం కంపెనీలు కొత్త సర్వీస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డు (KYC)లో ఉన్న పేరునే ఇన్కమింగ్ కాల్ సమయంలో ప్రదర్శించే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇకపై ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎటువంటి యాప్ అవసరం లేకుండా, ఫోన్ స్క్రీన్‌పైనే కాలర్ పేరు కనిపించనున్నది!


