అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
ఇకపై జీరో బ్యాలెన్స్ ఖాతాలకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు లభ్యమవనున్నాయి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలకు డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ ఖాతాలకు పరిమిత సేవలు మాత్రమే లభ్యమయ్యే విధంగా నిబంధనలు ఉండగా, తాజా మార్గదర్శకాలతో డిజిటల్ లావాదేవీలు, మొబైల్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది డిజిటల్ ఆర్థిక సమగ్రతను పెంచడంలో మైలురాయిగా భావిస్తున్నారు. దేశంలోని తక్కువ ఆదాయ వర్గాలకూ ఆధునిక బ్యాంకింగ్ సేవలు చేరవేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.


