హైదరాబాద్, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారి నేతృత్వంలో “ఇంపాక్ట్” సంస్థ ద్వారా ఉచితంగా నిర్వహించబడుతున్న Train The Trainer వర్క్‌షాప్ ఏప్రిల్ 15న ప్రారంభమవుతోంది. వ్యక్తిత్వ వికాసం, భయాల నివారణ, కెరీర్ అభివృద్ధి వంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వబడనున్న ఈ వర్క్‌షాప్ యువతకు జీవితం పట్ల కొత్త దృక్పథాన్ని అందించనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారిని వెంటనే రిజిస్టర్ అవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. “మీ భయాలను మీ బలంగా మార్చుకునే సమయం ఇది” అనే నినాదంతో ప్రారంభమవుతున్న ఈ శిక్షణ శిబిరానికి సీట్లు పరిమితంగా ఉన్నాయి.
విశేష సమాచారం కోసం ఈ క్రింది నంబర్లకు సంప్రదించవచ్చు:
సంతోష్ కుమార్ – 98491 87544
స్వాతి పబ్బా – 83742 89992
శ్రీనివాస్ పెరుమండ్ల – 93466 08326