Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఇంధన పొదుపుపై ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో అవగాహన

Punnami Newsroom Published:
ఇంధన పొదుపుపై ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో అవగాహన

Story highlights

  • బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని వివరించిన అధికారులు ఆత్మకూరు, నవంబర్ 2 ( పున్నమి ప్రతినిధి) బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఉద్యోగులకు వివరించి, ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంధన పొదుపునకు పాటించాల్సిన ఆరు ముఖ్యమైన సూచనలను వివరించారు.
  • విద్యుత్ ఆదా కోసం ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వినియోగించాలని, రెడ్‌ సిగ్నల్స్‌, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజిన్లను నిలిపివేయాలని సూచించారు.

బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్

ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని వివరించిన అధికారులు

ఆత్మకూరు, నవంబర్ 2 ( పున్నమి ప్రతినిధి) బ్రిక్స్ సుస్థిర జీవనశైలి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ఉద్యోగులకు వివరించి, ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంధన పొదుపునకు పాటించాల్సిన ఆరు ముఖ్యమైన సూచనలను వివరించారు. విద్యుత్ ఆదా కోసం ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు వినియోగించాలని, రెడ్‌ సిగ్నల్స్‌, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వాహనాల ఇంజిన్లను నిలిపివేయాలని సూచించారు. పెట్రోల్‌, డీజిల్ వాహనాలకు బదులుగా సిఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.వాహనాలను సరైన గేర్‌లో నడపాలని, గేర్లు మార్చే సమయంలో తప్ప ఇతర సమయాల్లో క్లచ్‌పై కాలు ఉంచకూడదని సూచించారు. ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచాలని, తక్కువ పికప్‌తో నల్లటి పొగ వెలువరించే వాహనాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిపై తగిన శ్రద్ధ చూపాలని వివరించారు.ఈ సూచనలన్నింటినీ నిత్యజీవితంలో, విధి నిర్వహణలో పాటిస్తూ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఉద్యోగులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎం. శివకేష్ యాదవ్, సీహెచ్ రాజకుమార్ (ఏఎం–టీ), ఎం. బాబు రావు (సూపర్‌వైజర్ మెకానిక్), భద్రతా సిబ్బంది, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *