కామారెడ్డి, 19 అక్టోబర్, పున్నమి ప్రతినిధి
రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యకలాపాల్లో విద్యుత్ లైన్ అడ్డంకిగా మారినట్లు మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన గ్రామంలో నిర్మా ణం పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, తెడ్డు జ్యోతి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, అక్కడ గల విద్యుత్ లైన్ కారణంగా నిలిచిపోయిందన్నారు. ఈ సమస్య ను సంబం ధిత విద్యుత్ అధికారులకు వివరించినట్లు తెలిపారు. ఫలితంగా, ఉన్నతాధి కారులు క్షేత్రస్థాయిలో విచారం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలిపా రు.అధికారులు రెండు విద్యుత్ స్తంభాలను మం జూరు చేయాలని నిర్ణయం తీసుకుని, విద్యుత్ లైన్ తొలగించి పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, నిశాంత్, బండి రవి తదితరులు పాల్గొన్నారు.


