

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు…
తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో లబ్ధిదారురాలు ప్రవళిక సురేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరో్జు గృహప్రవేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో తొలి ఇందిరమ్మ ఇల్లును తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరంగా ఉందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. గృహప్రవేశంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి నూతన ఇల్లును ప్రారంభించారు.
అనంతరం ప్రవళిక సురేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. మినహా లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ప్రోత్సాహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుందన్నారు. రూ.5 లక్షలతో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున దశల వారీగా ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలేదని శ్రీనివాస్ రెడ్డి గారు విమర్శించారు.
ఇట్టి కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, తాజామాయి సర్పంచ్ నర్సింలు గౌడ్, దుబ్బాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), తొగుట మాజీ ఎంపీపీ గంటా రేణుక రవీందర్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దేవునూరి పోచయ్య, గ్రామ అధ్యక్షులు చీకట్ల స్వామి, మాజీ ఎంపిటిసి కానుగంటి సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నం భూపాల్ రెడ్డి, కూచ మహిపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, రాంపూర్ రమేష్, కోమటిరెడ్డి పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

