పున్నమి ప్రతినిధి
&ఇందిరమ్మ ఇండ్ల టోల్ ఫ్రీ కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ప్రారంభం
+పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయడం కోసం, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈరోజు హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ గారితో కలిసి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించిన తర్వాత న స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్కొ రెడ్డి కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకొని వారితో మాట్లాడారు. వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చారు. వరంగల్ జిల్లా ఖిల్లా ఘన్ పూర్ నుంచి ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన ఇల్లు బేస్ మెంట్ వరకు పూర్తయిందని, బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగగా అతని ఆధార్ నెంబర్ అడిగి తెలుసుకొని విచారణ చేయగా.. అతని ఫైల్ E. E . దగ్గర ఉంది. సోమవారం బిల్లు వస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు అతను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు గ మంత్రి తెలియజేశారు
మరొకరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి.. వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందని, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తారని అడిగారు. హైదరాబాద్ లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుంది.. త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం కనుగొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని మంత్రి శ్రీనివాస్హా రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టడమే గాకుండా లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నాం. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ కానున్నాము అని మంత్రి అన్నారు
అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదల ఇండ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోంది. గూడు లేని పేదలకు ఇండ్లు ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.


