మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గాంధీ 108 వ జయంతి సందర్బంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి సీతమ్మదారలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ దేశ ప్రధానిగా ఉన్నపుడు తమిళనాడు,ఒడిస్సా పోటీ పడిన ఆ అవకాశం విశాఖకు వచ్చింది, వేల మంది రైతులు 22 వేల ఎకరాలు భూములు రైతులు ఇవ్వగ, స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి శాసనసభ్యుడు అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారు,పోరాటంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు, స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి ఉత్తరాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసారు, చివరికి ఇందిరమ్మ విశాఖకు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది.
విశాఖ ఉక్కు తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్, నిలబట్టుకోవాల్సిన బాధ్యత కూడ కాంగ్రెస్ దే, ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ని తెల్ల ఏనుగుతో పోల్చడం బాధాకరం, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించడం, ప్రతిపక్షాలు సీఎం మాటలను వక్రీకరిస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక అన్నారు.
ప్రపంచంలో స్టీల్ వినియోగం పెరిగిందని, చైనా స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని,తరువాత స్థానంలో భారత్ ఉందని, దేశంలో సొంత ఘనులు ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సైల్, దాంట్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ ని విలీనం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని లాభాలలోకి తీసుకువచ్చి పూర్తి స్థాయి కెపాసిటీతో నడిపితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చాలా వేగంగా చేరుకోవచ్చని, దశాబ్దాలుగా కార్మికుల కష్టంతో, నిర్వాసితుల త్యాగంతో నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బంగారు బాతులాంటి పరిశ్రమను అధాని జేబు నింపుకోవడానికి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్కు మహిళ ఇందిరమ్మ, అమృతరావు ఆనాటి కాంగ్రెస్ నాయకుల స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం తలవంచే వరకు వివిధ మార్గాలలో ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటం కొనసాగిస్తామని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానియమని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సైల్ లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేలా నేను కృషి చేస్తానని ప్రియాంక అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఫర్వీన్ ఖాన్, జగన్ మురారి, వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, గుర్రం కనకరాజు, వేమూరి సురేష్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


