నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో వచ్చే సోమవారం (సెప్టెంబర్ 8) నుండి టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5991 యాక్టివేషన్ లోకి రానుందని జిల్లా గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్
రాజ్ కుమార్ గురువారం (సెప్టెంబర్ 4) ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ
ఇళ్ల బిల్లుల పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి, ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తమ స్టేటస్ ను పరిశీలించుకోవచ్చు అని ఆయన వివరించారు.
ఫోటో క్యాప్చర్ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు కలిగిస్తే, దశలవారీగా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు,స్వయంగా తమ ఇళ్ల నిర్మాణ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.ఇందుకోసం లబ్ధిదారుల మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుందని ఆ నెంబర్ ని నమోదు చేస్తే ఫోటో అప్లోడ్ చేసే వీలు ఉంటుందని వివరించారు.
ఆధార వివరాల్లో చిన్న తప్పులు ఉంటే సంబంధిత ఎంపీడీవోను సంప్రదించాలని, పూర్తిగా ఆధార నంబరే మార్చాల్సి వస్తే జిల్లా కలెక్టర్ అనుమతితోనే మార్పు సాధ్యమవుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్ స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల సమస్యలకు :టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభం కానుంది
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో వచ్చే సోమవారం (సెప్టెంబర్ 8) నుండి టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5991 యాక్టివేషన్ లోకి రానుందని జిల్లా గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గురువారం (సెప్టెంబర్ 4) ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల బిల్లుల పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి, ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తమ స్టేటస్ ను పరిశీలించుకోవచ్చు అని ఆయన వివరించారు. ఫోటో క్యాప్చర్ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు కలిగిస్తే, దశలవారీగా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులు,స్వయంగా తమ ఇళ్ల నిర్మాణ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.ఇందుకోసం లబ్ధిదారుల మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుందని ఆ నెంబర్ ని నమోదు చేస్తే ఫోటో అప్లోడ్ చేసే వీలు ఉంటుందని వివరించారు. ఆధార వివరాల్లో చిన్న తప్పులు ఉంటే సంబంధిత ఎంపీడీవోను సంప్రదించాలని, పూర్తిగా ఆధార నంబరే మార్చాల్సి వస్తే జిల్లా కలెక్టర్ అనుమతితోనే మార్పు సాధ్యమవుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్ స్పష్టం చేశారు.

