ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ ఇంతటి ఆత్మీయ అభిమానం ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని మార్క్ ఫెడ్ కార్యాలయం ఆవరణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మార్క్ ఫెడ్ కార్యాలయం చేరుకున్న ఆయనకు ఏపి మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు, సిబ్బంది, జిల్లా మేనేజర్ హరినాథ్ రెడ్డి, ప్లాంట్ మేనేజర్ అనుషా అధ్వర్యంలో భారి గజమాలతో, అర్చకులు వెంటరాగ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం, సుమారు కోటిన్నర రూపాయలతో పునర్నిర్మాణ చేసిన దాన కర్మాగారం, పప్పుల మిల్లుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ప్లాంట్ ఆవరణంలో చైర్మన్ తో, డిరెక్టర్లు, అధికారులు మొక్కలు నాటారు. అనంతరం, ప్లాంట్ ఆవరణంలో జరిగిన ప్రత్యేక పూజల్లో బంగార్రాజుతో పాటు మార్క్ ఫెడ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. అర్చకులు, వేద పండితులు వారిని ఆశీర్వదించారు మర్క్ఫ్ ఫెడ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ కర్రోతు బంగార్రాజు మాట్లడుతూ మనం బాగుండాలంటే.. సంస్థ బాగుందలన్నారు. సంస్థ బాగుండాలంటే.. అందరు కలిసికట్టుగా పని చెయ్యలని ఆయన పిలుపు ఇచ్చారు. సంస్థను లాభాల్లో నడిపించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా ప్లాంట్ సుమారు నాలుగేళ్ల పాటు మూసివెయ్యడం పట్ల బంగార్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తానూ బాద్యతలు చేపట్టిన 10 నెలలలో ప్లాంట్ లో పనులు పూర్తీ చెయ్యడంలో అందరి సహకరం ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు మార్క్ ఫెడ్ లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సిఐటియు నాయకులు గౌస్ చైర్మన్ దృష్టికి తీసుకోవేల్లారు. సమస్యను బోర్డు సమావేశాల్లో చర్చించి పది రోజుల్లో పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటామని అయన హామీ ఇచ్చారు. నంద్యాల మార్క్ ఫెడ్ కు సుమారు 3.77 ఎకరాల్లో స్థలం ఉందని, అందులో చాల వరకు ఖాలిగా ఎందుకు ఉందని ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ స్థానిక అధికారులను ప్రశ్నించారు. అ స్తాలాన్ని ఖాలిగా ఉంచకుండా, ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని, ఫలితంగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుందని అయన పేర్కొన్నారు రాష్ట్రలో ఏపి మార్క్ ఫెడ్ అధ్వర్యంలో పలు పరిశ్రమలు నడుస్తున్నాయని ఆయన అన్నారు. మా ఉత్తరాంధ్ర ప్రాంతలో కంది, పప్పుదినుసుల వంటి పంటలు పండవని, కేవలం పాడి మాత్రమే ఉంటుందని ఆయన చెప్పారు. నంద్యాల జిల్లా వంటి బాగా పంటలు పండే ప్రాంతాల్లో అభివృద్ధి బాగా జరుగుతుందని, అటువంటి చోట్ల పెట్టుబడులు పెట్టలని ఏపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ పారిశ్రామిక వేత్తలకు సూచించారు. రాష్ట్రంలోని 26 జిలాల్లో మార్క్ ఫెడ్ కో సొంత భవనలు నిర్మాణం కోసం ఆన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు బొబ్బిలిలో అక్రమనకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. తానూ నంద్యాల పర్యటనకు రావడానికి ముఖ్యకారణం ఏపి టిడిపి రాష్ట్ర కార్యదర్శి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. తను ఊహించిన దానికన్నా అయన ఆహ్వానించిన విధానం, ఆత్మీయత చూస్తే, పెళ్లి మండపం నుంచి నూతన వధువరులను ఆహ్వానించి తీసుకొచ్చినట్టు ఉందని ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ బంగార్రాజు పేర్కొన్నారు. నంద్యాలలో తులసి రెడ్డి అధ్వర్యంలో మార్క్ ఫెడ్ అభివృద్దికి తాము అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం, చైర్మన్, డైరెక్టర్స్ ను నంద్యాల మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులు నంది విగ్రహాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు అనంతరం, నంద్యాల జిలాల్లో పొగాకు సాగు చేసిన రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను టిడిపి యువనేతలు భగవాన్ చౌదరి, చాంద్ బాష ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ బంగార్రాజు దృష్టికి తీసుకోవేల్లారు. స్థానికంగా పొగాకు సాగు చేసిన రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చెయ్యాలని భగవాన్ చౌదరి ఆయనను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఏపి మార్క్ ఫెడ్ చైర్మన్ పొగాకు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోవేల్లుతానని హామీ ఇచ్చారు.


