పున్నమి ప్రతినిధి
👉ఛత్తీస్గఢ్‌లో నక్సలైట్ల హింస చెలరేగి అమాయక ప్రజలు హతమవుతున్నప్పుడు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది..!
👉నక్సలైట్ల ప్రభావం వున్న ప్రతి గ్రామంలో ‘గ్రామీణ రక్షా దళం’ను ఏర్పాటు చేసి, వారికి తుపాకులు ఇచ్చి, యువకులకు శిక్షణ కూడా ఇచ్చింది. దీనికి సానుకూల ఫలితాలు వచ్చాయి..!
👉గ్రామస్తులు నక్సలైట్లతో పోరాడటం ప్రారంభించారు, దాడులకు ప్రతిదాడి చేయడం మొదలుపెట్టారు.
పోలీసులు మాత్రమే కాకుండా గ్రామస్తుల చేతుల్లో కూడా నక్సలైట్లు చనిపోవడం మొదలైంది. ఈ గ్రామీణ రక్షా దళానికి “సల్వా జుడుమ్” అనే పేరు పెట్టారు..!
👉ఇంత జరుగుతుంటే అర్బన్ నక్సలైట్లు, వ్వస్థల్లోని వారి తొత్తులూ చూస్తూ కూర్చుంటారా..?
👉వారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వామపక్ష భావజాలం కలిగిన ఒక న్యాయమూర్తి వెంటనే ఆ పిటిషన్ స్వీకరించి, తీర్పు కూడా వెంటనే ఇచ్చి సల్వా జుడుమ్ రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించి నిషేధించారు..!
👉ఆ తర్వాత నక్సలైట్లు చేసిన నరమేధానికి మొత్తం బస్తర్ జిల్లా రక్తపాతంతో తడిసిపోయింది. ఇన్ఫార్మల్లు అనే నెపంతో అమాయక గిరిజనులను వందల మందిని చెట్లకు కట్టేసి గొడ్డళ్ళతో నరికి చంపారు. అమాయకుల రక్తం ఏరులై పారింది..!
👉ఆ తరువాత ప్రశాంత్ భూషణ్ వేసిన పిటిషన్ను ఆధారం చేసుకుని, ఉగ్రవాదులతో, నక్సలైట్లతో పోరాడుతూ అమరులు అయిన సైనికుల పిల్లలకు సాయుధ దళాల మెడికల్ కాలేజీలో ప్రవేశం కోసం కేంద్రం ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు అదే సదరు న్యాయమూర్తి..! కారణం ఏమిటంటే, సైనికులు దేశ సేవ చేస్తున్నందుకు వేతనం పొందుతున్నారు కాబట్టి అదనపు అనుకూలం ఇవ్వకూడదన్నది వారి తీర్పు..!
👉ఆ న్యాయమూర్తినే రిటైర్ అయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం కులగణన సంఘం అధ్యక్షుడిగా నియమించింది. ఆ న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కులగణన సంఘమే వెనుకబడిన వర్గాలకిచ్చే సౌకర్యాలు ముస్లింలకు కూడా ఇవ్వాలని సిఫారసు చేసింది..!
👉వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్లు ముస్లింలు తన్నుకుపోతున్నారంటే అందుకు కారణం ఆ న్యాయమూర్తే..!
ఆ న్యాయమూర్తి ఎవరో కాదు. ఖాంగ్రెస్ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి
ఆయన పేరు బి. సుదర్శన్ రెడ్డి అని అమిత్ షా విమర్శలు చేశారు


