Monday, 23 March 2026
  • Home  
  • ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి శిల్పం” – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం
- Featured - ఆంధ్రప్రదేశ్

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి శిల్పం” – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి శిల్పం” – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి” శిల్పానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఆర్ట్ గ్యాలరీని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ గారు సందర్శించారు. అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా, కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు ఐరన్ స్క్రాప్‌తో రూపొందించిన “అమరావతి” పెడెస్టల్ శిల్పం ఆ రోజున ప్రజల మనసులను కదిలించింది. ఈ శిల్పాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసిన విషయం తెలిసిందే. రికార్డు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్‌ను సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా శిల్పకారులు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, “ఇలాంటి శిల్పాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయి. తెనాలిలో ఇలా అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ ఉండటం గర్వకారణం” అన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మెటల్ ఆర్ట్‌తోపాటు ఆధునిక 3D టెక్నాలజీ శిల్పాలు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయని కొనియాడారు. అంతలో కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు సబ్ కలెక్టర్ గారిని శాలువాతో సత్కరించి మోమెంటో అందజేశారు. త్వరలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కూడా శిల్పానికి గుర్తింపులు రానున్నాయని వారు తెలిపారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి శిల్పం” – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం

గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన “అమరావతి” శిల్పానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఆర్ట్ గ్యాలరీని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ గారు సందర్శించారు.

అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా, కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు ఐరన్ స్క్రాప్‌తో రూపొందించిన “అమరావతి” పెడెస్టల్ శిల్పం ఆ రోజున ప్రజల మనసులను కదిలించింది. ఈ శిల్పాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసిన విషయం తెలిసిందే. రికార్డు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్‌ను సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా శిల్పకారులు స్వీకరించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, “ఇలాంటి శిల్పాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయి. తెనాలిలో ఇలా అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ ఉండటం గర్వకారణం” అన్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మెటల్ ఆర్ట్‌తోపాటు ఆధునిక 3D టెక్నాలజీ శిల్పాలు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయని కొనియాడారు.

అంతలో కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు సబ్ కలెక్టర్ గారిని శాలువాతో సత్కరించి మోమెంటో అందజేశారు. త్వరలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి కూడా శిల్పానికి గుర్తింపులు రానున్నాయని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.