ఇండియా నుండి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సలెక్ట్ అయినా… కుర్వ హరి కృష్ణ
జోగులాంబ గద్వాల్ నవంబర్ 01(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు నివాసి అయిన కుర్వ హరి కృష్ణ s/o భీముడు. నేపాల్ లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1500 మీటర్స్ రన్నింగ్ రేస్ కి ఇండియా తరపున సెలెక్ట్ కావడం జరిగింది. గతంలో కూడా హరి కృష్ణ నేషనల్ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీద కూడా ప్రశంస అందుకోవడం జరిగింది. ఇప్పుడు హరికృష్ణ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సలెక్ట్ కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది


