*ఇంటి చుట్టు బ్రాహ్మాణులే ఉన్నారు గుడ్లు పెట్టే నాటు కోటి పెట్టను ఎవడు దొంగలించి తిన్నటో అర్థం కావటం లేదు..*
*ఈ బీసీ పోరాటం ఎవడి మీద..?*
నాగర్ కర్నూల్ 18,( పున్నమి న్యూస్ ) :
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగింది
బీసీ వర్గాలు చేపట్టిన ఈ బంద్ కు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, జాగృతి, వామపక్షాలు మద్దతుగా తెలిపాయి.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా బంద్ పాటిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
బీసీ రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.*
బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన బంద్కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు.
బీసీ నిరసనలకు బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది.
దీంతో తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి.
అయితే ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది.
అందరూ బీసీలకు మద్దతు తెలుపుతుంటే.. మరి బీసీలను మోసం చేస్తున్నదెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.


