అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 6 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్) : ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం అరుణ గారి సమక్షంలో టీచర్లు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రభుత్వ బడులే పిల్లల భవిష్యత్‌కు పునాది అని ఉపాధ్యాయులు తెలిపారు.


