ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం : ఎమ్మెల్యే అమర్

0
2

పలమనేరు, : ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టదలచిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సభ్యులతో అయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధి పై గ్రామ స్థాయిలోని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారించ డమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం
(కే ఎస్ ఎస్) కుటుంబ సాధికారిక సభ్యులుగా ఉన్న వారు బాధ్యత తీసుకొని పార్టీ రూపొందించిన ఫార్మట్ ప్రకారం వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు తప్పక అందెలా చూడాలన్నారు. బూత్ లెవల్ స్థాయిలో కనీసం రోజుకు 50 కుటుంబాలకు తగ్గకుండా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ కార్యక్రమం నియోజకవర్గం లోని వి. కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ఈ నెల 2 న ప్రారంభించి ఏక కాలంలో అన్ని మండలాల్లో విజయవంతంగా సాగేలా చూడాలని కోరారు. అనంతరం కార్యక్రమ కార్యాచరణ పై నాయకులతో ఆయన చర్చించారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్,కిషోర్ గౌడ, సోమశేఖర్ గౌడ్, ఆనంద,నాగరాజు రెడ్డి, కుట్టి,నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్, సురేష్, గిరి, ప్రతాప్, బ్రహ్మయ్య, ఖాజా, నాగరాజు, చౌడప్ప, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

0
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here