Saturday, 21 February 2026
  • Home  
  • ఇంటర్మీడియేట్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు,జిల్లా ఎస్.పి. డా.అజిత వేజెండ్ల IPS,,గారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటర్మీడియేట్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు,జిల్లా ఎస్.పి. డా.అజిత వేజెండ్ల IPS,,గారు.

SPS నెల్లూరు జిల్లా తేది:21.02.2026 జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ పోలీస్ కంట్రోల్ వాట్సాప్ +919392903413 లేదా 100/112 కు సమాచారం అందించాలి – జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత, పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతీ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలియచేసారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆర్మ్డ్ గార్డులను పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలు నిఘా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణ నిర్వహించేందుకు ఇతర శాఖల సమయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని, ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షలు జరుగు సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని, కావున దయచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదన్నారు. చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

SPS నెల్లూరు జిల్లా
తేది:21.02.2026

జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ పోలీస్ కంట్రోల్ వాట్సాప్
+919392903413 లేదా 100/112 కు సమాచారం అందించాలి – జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారు,
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత,
పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు

మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం

ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతీ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలియచేసారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు.

పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆర్మ్డ్ గార్డులను పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలు నిఘా ఉంటుంది.

జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణ నిర్వహించేందుకు ఇతర శాఖల సమయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని, ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షలు జరుగు సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.

విద్యార్థులు ఉదయం 9 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని, కావున దయచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదన్నారు. చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.