Tuesday, 17 February 2026
  • Home  
  • ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము -స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- విశాఖపట్నం

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము -స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

విశాఖపట్నం ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’లో పాల్గొనేందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. నగర విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, నౌకాదళ ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షించనున్నారు. విశాఖ తీరంలో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకు దేశ విదేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

విశాఖపట్నం ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)

అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’లో పాల్గొనేందుకు గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం చేరుకున్నారు. నగర విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, నౌకాదళ ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షించనున్నారు. విశాఖ తీరంలో నిర్వహించనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకకు దేశ విదేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.