Thursday, 5 February 2026
  • Home  
  • ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం.
- విశాఖపట్నం

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం.

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం. *విశాఖ పట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి*. ఆహార పరిశుభ్రత, వాటి నాన్యాతలపై ఆహార తయారీ దారులకు అవసరమైన శిక్షణ ఇస్తామని విశాఖ పట్నం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఇటీవల అమరావతి దరి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆహార భద్రతాధికారులకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీర పాండ్యన్ ఆధ్వర్యంలో ఆహార పరిశుభ్రత, నాణ్యత, భద్రత అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తమకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకుడు డాక్టర్ దినేష్ ఆహార భద్రతకు సంబంధించిన పలు విషయాలపై శిక్షణ ఇచ్చారన్నారు. నగరంలో ఉన్న హోటల్స్, క్యాటరింగ్ నిర్వాహకులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, పానీ పూరీ బండ్లు, కర్రీ పాయింట్స్, టిఫిన్ సెంటర్స్ తదితర ఆహార తయారీదారులకు పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, ప్యాకింగ్ జాగ్రత్తలు తదితర విషయాలపై త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారులు ఆహార పదార్థాలను తయారు చేసేటప్పడు తలకు క్యాప్, నోటికి మాస్క్ ధరించడం, గోర్లు కత్తిరించు కోవడం, అంటు వ్యాధులు, గాయాలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. వీటన్నింటి నిర్వహణపై ఆహార తయారీ దారులకు త్వరలో సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారుల ఆధార్ నంబర్స్, ఫోన్ నంబర్స్ తీసుకుని వాటిని తమ వెబ్సైట్ లో నమోదు చేస్తామన్నారు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వచ్చే నెల విడుదల చేస్తా మన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు కొంత అమౌంట్ తీసుకుని ఇటువంటి శిక్షణ ఇచ్చే వారని, ప్రస్తుతం తామే ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి జి.వి.అప్పారావు మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అవసరమైన ఈ ఆహార భద్రతా శిక్షణను ప్రతి ఆహార తయారీ దారుడు విధిగా తీసుకుని, తామిచ్చే ధృవీకరణ పత్రం పొందాలన్నారు.

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం.
*విశాఖ పట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి*.
ఆహార పరిశుభ్రత, వాటి నాన్యాతలపై ఆహార తయారీ దారులకు అవసరమైన శిక్షణ ఇస్తామని విశాఖ పట్నం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఇటీవల అమరావతి దరి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆహార భద్రతాధికారులకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీర పాండ్యన్ ఆధ్వర్యంలో ఆహార పరిశుభ్రత, నాణ్యత, భద్రత అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తమకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకుడు డాక్టర్ దినేష్ ఆహార భద్రతకు సంబంధించిన పలు విషయాలపై శిక్షణ ఇచ్చారన్నారు. నగరంలో ఉన్న హోటల్స్, క్యాటరింగ్ నిర్వాహకులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, పానీ పూరీ బండ్లు, కర్రీ పాయింట్స్, టిఫిన్ సెంటర్స్ తదితర ఆహార తయారీదారులకు పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, ప్యాకింగ్ జాగ్రత్తలు తదితర విషయాలపై త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారులు ఆహార పదార్థాలను తయారు చేసేటప్పడు తలకు క్యాప్, నోటికి మాస్క్ ధరించడం, గోర్లు కత్తిరించు కోవడం, అంటు వ్యాధులు, గాయాలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. వీటన్నింటి నిర్వహణపై ఆహార తయారీ దారులకు త్వరలో సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారుల ఆధార్ నంబర్స్, ఫోన్ నంబర్స్ తీసుకుని వాటిని తమ వెబ్సైట్ లో నమోదు చేస్తామన్నారు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వచ్చే నెల విడుదల చేస్తా మన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు కొంత అమౌంట్ తీసుకుని ఇటువంటి శిక్షణ ఇచ్చే వారని, ప్రస్తుతం తామే ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి జి.వి.అప్పారావు మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అవసరమైన ఈ ఆహార భద్రతా శిక్షణను ప్రతి ఆహార తయారీ దారుడు విధిగా తీసుకుని, తామిచ్చే ధృవీకరణ పత్రం పొందాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.