*ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు*
ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన
నిందుతుడు పిట్టల వెంకటేశ్వర్లు కు జీవిత ఖైదు శిక్ష విదిస్తూ సత్తుపల్లిలో గౌరవనీయులైన VI ADJఎం.శ్రీనివాస్ రావు గారు తీర్పు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే… తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లుకి తల్లి పిచ్చమ్మతో పాటు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. జల్సాలకు అలవాటుపడిన వెంకటేశ్వర్లు రెండేళ్ల కిందట మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్య పిట్టల దుర్గను హత్య చేశాడు. ఈ కేసులో కొంతకాలం జైలు జీవితం గడిపి ఆ తరువాత బెయిల్‌పై బైటికి వచ్చాడు. దుర్గ మరణాంతరం గోపాలపేటలోని నానమ్మ పిట్టల పిచ్చమ్మ వద్దే ఆమె మనవరాళ్ల్లు నీరజ, ఝాన్సీ ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కన్నతల్లి నివాసం ఉంటున్న ఇంటిపై వెంకటేశ్వర్లుకు కన్నుపడింది. తన కొడుకు నేర ప్రవృత్తి గు రించి తెలిసిన పిచ్చమ్మ ఇద్దరు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచనలో పడింది. దీంతో తన పేరిట ఉన్న ఆస్తిని తన మనమరాళ్ళ పేరు మీ ద మార్చాలని నిర్ణయించుకుంది.
తల్లిపై కక్ష పెంచుకొని హత్యకు ప్రణాళిక రచించి 17.05.2024 న ముగ్గురుని హతమార్చాడు.
కేసు విచారణ అధికారి
ఎన్. సాగర్ (సర్కిల్-ఇన్‌స్పెక్టర్) Addl పబ్లిక్ ప్రాసిక్యూటర్
SK.అబ్దుల్ బాషా
అనుసంధాన అధికారులు –
కె.శ్రీకాంత్ ఎస్సై డి.నాగేశ్వరరావు HC
CDOs బి. హరిదాస్
హెచ్‌సి చెన్నారావు
మరళీకృష్ణ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


