ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం గొప్ప విషయం. కానీ టీ20ల్లో భారత్‌కి ఆ జట్టుపై అద్భుతమైన రికార్డు ఉంది. గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టీమిండియా ఆస్ట్రేలియాలో సిరీస్ కోల్పోలేదు. అదే రికార్డును కొనసాగిస్తూ, ఈసారి కూడా భారత్ 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
బ్రిస్బేన్‌లో జరిగిన ఐదో టీ20 వర్షంతో రద్దయింది. ఆ సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (23), శుభ్‌మన్ గిల్ (29) వేగంగా రన్స్ సాధించారు. కానీ వర్షం ఆ మ్యాచ్‌ను నిలిపివేసింది.
తద్వారా భారత్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్‌లు ఓడినా టీమిండియా గెలిచింది. వన్డేలు, టీ20లు కలిపి ఈ టూర్‌లో మొత్తం 8 టాస్‌ల్లో 7 సార్లు ఓడినా భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది.


