Monday, 8 December 2025
  • Home  
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ*
- విశాఖపట్నం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ*

*ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ* *డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ* *ఇప్పటి వరకు తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన మంత్రి డా.స్వామి* విశాఖ, నవంబర్,పున్నమి ప్రతినిధి:- తీవ్ర అనారోగ్యానికి గురై విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి బోనెల చరణ్ ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధి ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి చరణ్ ని మంత్రి స్వామి ప్రత్యేక చొరవ తీసుకుని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నేడు విద్యార్థిని పరామర్శించారు. డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ విద్యా సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మందికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో వైద్యం చేయించి వారి ప్రాణాలు కాపాడారు.

*ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థికి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శ*

*డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ*

*ఇప్పటి వరకు తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన మంత్రి డా.స్వామి*

విశాఖ, నవంబర్,పున్నమి ప్రతినిధి:-

తీవ్ర అనారోగ్యానికి గురై విశాఖలోని మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థి బోనెల చరణ్ ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధి ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి చరణ్ ని మంత్రి స్వామి ప్రత్యేక చొరవ తీసుకుని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నేడు విద్యార్థిని పరామర్శించారు. డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి డా. స్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఈ విద్యా సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 37 మందికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో వైద్యం చేయించి వారి ప్రాణాలు కాపాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.