సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
ఆసియా కప్ లో లీగ్ దశలో పాటు ఫైనల్ మ్యాచ్ లోను విజయం సాధించిన భరత్.
ఈ ఆసియ కప్ లో రెండు సార్లు లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసి ఫైనల్ తో సహా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భరత్ విజకేతనం ఎగారావేసింది
దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించినా, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. కుల్స్టాప్ 4 వికెట్లు, బుమ్రా, వరుణ్, అక్షర్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేసి, దూబే 33 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయం భారత్‌కు మరో ఆసియా కప్ కిరీటాన్ని అందించింది.


