Thursday, 5 February 2026
  • Home  
  • ఆశ్రమంలో చిన్నారి చైరస్వి చౌదరి పుట్టినరోజు వేడుకలు: అన్నదానంతో చాటుకున్న మానవత్వం
- అన్నమయ్య

ఆశ్రమంలో చిన్నారి చైరస్వి చౌదరి పుట్టినరోజు వేడుకలు: అన్నదానంతో చాటుకున్న మానవత్వం

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని రాపూర్ రోడ్డు, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దత్తగిరి నారాయణ తపోవణ అభయాంజనేయ స్వామి ఆశ్రమం లో ఆదివారం ఒక విశేష సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. కందులవెంకటనారాయణ, తేజస్విత దంపతుల కుమార్తె కందుల చైరస్వి చౌదరి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -అన్నదానం – కూరగాయల పంపిణీ: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో నిర్వహించాలని నిర్ణయించుకున్న కందుల కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. కేవలం అన్నదానమే కాకుండా, ఆశ్రమ అవసరాల కోసం సరిపడా తాజా కూరగాయలను కూడా పంపిణీ చేశారు. చిన్నారి చైరస్వి అక్క ఉన్సిక చౌదరి స్వయంగా ఆశ్రమంలోని పెద్దలకు భోజనం వడ్డించి తన సేవా గుణాన్ని చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.నేటి యువత, పిల్లల తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుకలను ఇలా ఆశ్రమాల్లో జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆశ్రమంలోని నిస్సహాయులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. చైరస్వి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆశ్రమంలోని పెద్దలందరూ చిన్నారిని దీవించారు.ఈ సేవా కార్యక్రమంలో కందుల శివకుమార్, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.

చిట్వేల్, డిసెంబర్ 21 పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని రాపూర్ రోడ్డు, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న దత్తగిరి నారాయణ తపోవణ అభయాంజనేయ స్వామి ఆశ్రమం లో ఆదివారం ఒక విశేష సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. కందులవెంకటనారాయణ, తేజస్విత దంపతుల కుమార్తె కందుల చైరస్వి చౌదరి పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

-అన్నదానం – కూరగాయల పంపిణీ:

పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో నిర్వహించాలని నిర్ణయించుకున్న కందుల కుటుంబ సభ్యులు ఆశ్రమవాసులకు మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేశారు. కేవలం అన్నదానమే కాకుండా, ఆశ్రమ అవసరాల కోసం సరిపడా తాజా కూరగాయలను కూడా పంపిణీ చేశారు. చిన్నారి చైరస్వి అక్క ఉన్సిక చౌదరి స్వయంగా ఆశ్రమంలోని పెద్దలకు భోజనం వడ్డించి తన సేవా గుణాన్ని చాటుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పీఠాధిపతి నాగేశ్వరమ్మ ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మాట్లాడుతూ.నేటి యువత, పిల్లల తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుకలను ఇలా ఆశ్రమాల్లో జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆశ్రమంలోని నిస్సహాయులకు ఎంతో తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. చైరస్వి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఆశ్రమంలోని పెద్దలందరూ చిన్నారిని దీవించారు.ఈ సేవా కార్యక్రమంలో కందుల శివకుమార్, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకులు మరియు పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.