ఆల్టర్ నేటివ్ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ సునీత సారికి.
విశాఖ పట్నం,పున్నమి ప్రతినిధి:-
మానవాళికి అత్యంత సురక్షితమైన ఆల్టర్ నేటివ్ మెడిసిన్లో డాక్టర్ సునీత సారికి నార్త్ అమెరికా లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడిసినా ఆల్టర్నేటివా అజ్టెకా యూనివర్సిటీ నుంచి అత్యున్నత డాక్టరేట్ పట్టా పొందారు. మానవులను వేధిస్తున్న ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధిపై ఆల్టర్ నేటివ్ మెడిసిన్ తో తాను చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్ ను తనకు ప్రధానం చేశారన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మానవాళికి వస్తున్న అతి ప్రమాదకరమైన వ్యాధులకు వాడుతున్న పలు ఆధునిక ఔషధాల వల్ల ఆయా వ్యాధులు తగ్గుతున్నప్పటికీ, తరువాత మరికొన్ని ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వీటిని సమర్ధ వంతంగా నిరోధించేందుకు ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్, హిజామా తదితర 52 రకాల సురక్షితమైన ఆల్టర్ నేటివ్ థెరపీస్ ను తాను నిర్వహిస్తా నన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ వైద్య సదస్సులో తాను పాల్గొని పలు పరిశోధనా పత్రాలను సమర్పించా నన్నారు. సన్ఫో గ్లోబల్ ఫెడరేషన్ వారు సన్ఫో సపోర్టివ్ ఫెలో షిప్ ను తనకు ఇచ్చి గౌరవించా రన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్ లో డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పొందానన్నారు. సన్ఫో ఇంటర్నేషనల్ లైఫ్ ఫెలో షిప్ అవార్డ్ -2025 వచ్చిందన్నారు. ఆంధ్రా తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో మొత్తం ఐదుగురు పాల్గొనగా వారిలో మన రాష్ట్రంలోని విశాఖ పట్నం నుంచి నేను మాత్రమే పాల్గొన్నా నన్నారు. ది ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ విభాగంలో కూడా పలు అవార్డులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఆల్టర్ నేటివ్ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ సునీత సారికి.
ఆల్టర్ నేటివ్ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ సునీత సారికి. విశాఖ పట్నం,పున్నమి ప్రతినిధి:- మానవాళికి అత్యంత సురక్షితమైన ఆల్టర్ నేటివ్ మెడిసిన్లో డాక్టర్ సునీత సారికి నార్త్ అమెరికా లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడిసినా ఆల్టర్నేటివా అజ్టెకా యూనివర్సిటీ నుంచి అత్యున్నత డాక్టరేట్ పట్టా పొందారు. మానవులను వేధిస్తున్న ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధిపై ఆల్టర్ నేటివ్ మెడిసిన్ తో తాను చేసిన పరిశోధనలకు గాను ఈ డాక్టరేట్ ను తనకు ప్రధానం చేశారన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో మానవాళికి వస్తున్న అతి ప్రమాదకరమైన వ్యాధులకు వాడుతున్న పలు ఆధునిక ఔషధాల వల్ల ఆయా వ్యాధులు తగ్గుతున్నప్పటికీ, తరువాత మరికొన్ని ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వీటిని సమర్ధ వంతంగా నిరోధించేందుకు ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్, హిజామా తదితర 52 రకాల సురక్షితమైన ఆల్టర్ నేటివ్ థెరపీస్ ను తాను నిర్వహిస్తా నన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ వైద్య సదస్సులో తాను పాల్గొని పలు పరిశోధనా పత్రాలను సమర్పించా నన్నారు. సన్ఫో గ్లోబల్ ఫెడరేషన్ వారు సన్ఫో సపోర్టివ్ ఫెలో షిప్ ను తనకు ఇచ్చి గౌరవించా రన్నారు. ట్రెడిషనల్ మెడిసిన్ లో డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పొందానన్నారు. సన్ఫో ఇంటర్నేషనల్ లైఫ్ ఫెలో షిప్ అవార్డ్ -2025 వచ్చిందన్నారు. ఆంధ్రా తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్లో మొత్తం ఐదుగురు పాల్గొనగా వారిలో మన రాష్ట్రంలోని విశాఖ పట్నం నుంచి నేను మాత్రమే పాల్గొన్నా నన్నారు. ది ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ విభాగంలో కూడా పలు అవార్డులు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

