*ఆర్యవైశ్య సంఘము ఎన్నికలో పెండ్యాల విజయ్ కుమార్ ఘనవిజయం*
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 16 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య సమాజములో ఆదివారం రోజున ఆర్యవైశ్య సంఘము ఎన్నికలు జరిగాయి. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నము 03:00 వరకు సహృద్భావ స్నేహపూర్వక వాతావరణంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి తదనంతరం ఫలితములు విడుదల చేశారు.ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయ్ కుమార్ ముందుగా ఓట్లతో ఘన విజయం సాధించగా కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ కు 80 ఓట్లు సాధించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగినది. 2025–2028 దసరా పండగ వరకు శ్రీఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తానని, నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన పెండ్యాల విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కొప్పరపు నరసింహులు,మేడా వెంకటసుబ్బయ్య, పెడబల్లి సుందర్ రాజా,కామిశెట్టి పార్థసారథి, గుని శెట్టి రమేష్ పాల్గొన్నారు.


