నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి )
నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా నూతనంగా *ఆమెడ శ్రీధర్* ఎన్నికయ్యారు.
సోమవారం *రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు
రానున్న రోజుల్లో సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోలిశెట్టి సురేందర్, PV. రమణ రెడ్డి PACS చైర్మన్, మాజీ కౌన్సిలర్ మేడారం ప్రదీప్, రఘు తదితరులున్నారు.


