ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం
రైల్వేకోడూరు నవంబర్ 19
రైల్వేకోడూరు పట్టణంలోని పీఎంఆర్ కాంప్లెక్స్ లో సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ గురువారము రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మండపంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ డూండీ రాకేష్ పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి మా పాలకవర్గాన్ని ఆశీర్వదించి అనంతరం విందును ఆరగించాలని వారు కోరారు.


