జై వాసవి జై జై వాసవి
జై ఆర్యవైశ్య జై జై ఆర్యవైశ్య
స్టేషన్గన్పూర్ (పున్నమి ప్రతినిధి)
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఈరోజు (26-10-2025, ఆదివారం) జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ —
నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, మా మహాసభ పునఃజీవితమై జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో విశేష కార్యకలాపాలు చేపట్టడం గర్వకారణ అని తెలిపారు.
*గతంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 సభ్యత్వాలను 2500 సభ్యత్వాలుగా పెంచడమే కాకుండా, వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడం,*
*బతుకమ్మ పండుగను జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో 200 మందితో ఘనంగా నిర్వహించడం*,
*మరియు జిల్లా వ్యాప్తంగా 60 మంది ఉత్తమ ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని వివరించారు.*
అదేవిధంగా ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన OC JAC సమావేశంలో జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఐక్యతను ప్రతిబింబించే విధంగా పాల్గొనడం గర్వకారణమని తెలిపారు.
డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను వివరించారు — *రాబోయే రోజుల్లో పేద ఆర్యవైశ్య బంధువులకు పుస్తెమట్టలు, విద్య, వైద్యం వంటి రంగాల్లో సహాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాం*. *ఈ కార్తీకమాసంలో జిల్లా స్థాయి వనభోజనాలు నిర్వహించి, బంధుత్వ బంధాలను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.*
ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి మండల అధ్యక్షులు తుమ్మలపల్లి సోమేశ్వర్ గారు, జిల్లా మరియు మండల స్థాయి కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం ప్రతినిధులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


