Tuesday, 24 March 2026
  • Home  
  • ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
- ఎలూరు

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దని ఏలూరు జిల్లా ఆర్టిసి రవాణా అధికారి షేక్. షబ్నం సూచించారు. శుక్రవారం ఆగిరిపల్లి లోని ఆర్టీసీ బస్టాండ్ లోని వసతులను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లోని మరుగుదొడ్లను, త్రాగునీటిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో ఆగిరిపల్లి బస్టాండ్ లో ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆగిరిపల్లి నుండి హైదరాబాద్ కు బస్సును ఏర్పాటు చేశామని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. నూజివీడు డిపోలో 88 బస్సులకు గాను 44 బస్సులను స్త్రీ శక్తి పథకానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూజివీడు డిపో పరిధిలో ఇప్పటివరకు 60,826 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఆమెతోపాటు నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దని ఏలూరు జిల్లా ఆర్టిసి రవాణా అధికారి షేక్. షబ్నం సూచించారు. శుక్రవారం ఆగిరిపల్లి లోని ఆర్టీసీ బస్టాండ్ లోని వసతులను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లోని మరుగుదొడ్లను, త్రాగునీటిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ త్వరలో ఆగిరిపల్లి బస్టాండ్ లో ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆగిరిపల్లి నుండి హైదరాబాద్ కు బస్సును ఏర్పాటు చేశామని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. నూజివీడు డిపోలో 88 బస్సులకు గాను 44 బస్సులను స్త్రీ శక్తి పథకానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూజివీడు డిపో పరిధిలో ఇప్పటివరకు 60,826 మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఆమెతోపాటు నూజివీడు ఆర్టీసీ డిపో మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.