ఆర్టీసీ ఉద్యోగి బుర్ర రమేష్ గౌడ్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు

0
37

ఆర్టీసీ ఉద్యోగి బుర్ర రమేష్ గౌడ్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు

పున్నమి న్యూస్ – కాజీపేట ప్రతినిధి

 

కాజీపేట మండలంలోని మడికొండలో ఆర్టీసీ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన బుర్ర రమేష్ గౌడ్ గారికి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “రమేష్ గౌడ్ గారు ప్రభుత్వ ఉద్యోగిగా సమర్థవంతంగా సేవలందించారు. శేషజీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, బైరి కొమురయ్య, బిల్లా రవీందర్, కూనూర్ రాజు, సాక్షి రాజేందర్, చంటి, జిట్ట గౌతమ్, స్వామేల్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

0
0