విశాఖపట్నం గాజువాక దువ్వాడ : జనవరి పున్నమి ప్రతినిధి
ఆర్‌ఐసీఎస్ విద్యుత్ శాఖలో పనిచేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న బాలును జె.ఎన్.ఎం.యు.ఆర్.ఎం కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసుల అవసరాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పగలు–రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరా సమస్యలు, అంతరాయాలపై వెంటనే స్పందిస్తూ సేవలందిస్తున్న బాలును ప్రజలు అభినందించారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నందుకే ఆయనకు ఈ అవార్డు దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు ముమ్మిడివరపు రాము, ఈశ్వరరావు, శ్యాము, సంతోష్, వెంకటరమణ, సోమేశ్వరరావు, రాంబాబు, అప్పారావు, శివ తదితరులు పాల్గొని బాలును శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రతి ఉద్యోగికి బాలూ ఆదర్శంగా నిలుస్తారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
Uploaded Video:





