Thursday, 26 March 2026
  • Home  
  • ఆరోహన్–2026 పోస్టర్ ఆవిష్కరణ ఎస్బీఐటీలో ఏప్రిల్ 3,4 తేదీల్లో వార్షికోత్సవ వేడుకలు:
- ఖమ్మం

ఆరోహన్–2026 పోస్టర్ ఆవిష్కరణ ఎస్బీఐటీలో ఏప్రిల్ 3,4 తేదీల్లో వార్షికోత్సవ వేడుకలు:

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఎస్‌.బి‌. ఐ.టి. ఇంజినీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరగనున్న ఆరోహన్–2026 కార్యక్రమ పోస్టర్‌ను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఆనవాయితీగా ఈసారి కూడా ప్రాజెక్ట్ ఎక్స్‌పో, టెక్నికల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గిస్తూ, వారి సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికి తీసేందుకు ఆరోహన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి, వైస్‌ చైర్మన్ డాక్టర్ జి. శ్రీ చైతన్య, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ— ఏప్రిల్ 3న ప్రాజెక్ట్ ఎక్స్‌పో మరియు టెక్నికల్ ఈవెంట్స్, ఏప్రిల్ 4న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు జరుపనున్నట్లు ప్రకటించారు. విభిన్న విభాగాల తరఫున పోటీలు నిర్వహించబడతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, గంధం శ్రీనివాసరావు, డా. ఎ.వి.వి. శివప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

ఎస్‌.బి‌. ఐ.టి. ఇంజినీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరగనున్న ఆరోహన్–2026 కార్యక్రమ పోస్టర్‌ను కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వహించే ఆనవాయితీగా ఈసారి కూడా ప్రాజెక్ట్ ఎక్స్‌పో, టెక్నికల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గిస్తూ, వారి సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికి తీసేందుకు ఆరోహన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి, వైస్‌ చైర్మన్ డాక్టర్ జి. శ్రీ చైతన్య, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ—
ఏప్రిల్ 3న ప్రాజెక్ట్ ఎక్స్‌పో మరియు టెక్నికల్ ఈవెంట్స్,
ఏప్రిల్ 4న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు జరుపనున్నట్లు ప్రకటించారు.

విభిన్న విభాగాల తరఫున పోటీలు నిర్వహించబడతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, గంధం శ్రీనివాసరావు, డా. ఎ.వి.వి. శివప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.