కాకినాడ జిల్లా, కాకినాడ:
న్యాయం కోసం కృషి చేసే వారే నేటి పరిస్థితుల్లో నిందితులుగా మారుతున్నారు. ప్రజా సమస్యలు ఎత్తిచూపి, బాధితులకు అండగా నిలుస్తే “ఆరాచకం” అంటూ విమర్శల వర్షం కురుస్తోంది. ఇటువంటి పరిస్థితులను ఇప్పుడు కాకినాడలోని జనసేన పార్టీకి చెందిన వీరమహిళలు ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ 19వ డివిజన్ ఇన్‌చార్జ్ బొట్టు లీలా ఆవేదన వ్యక్తం చేస్తూ
తాము పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు కట్టుబడి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే,తమ స్వంత పార్టీ నాయకులే అడ్డుపడుతున్నారని ఇది నిరాశకు గురిచేస్తోందని ఆమె ఆక్రోధన వ్యక్తం చేసారు
ఇటీవల జరిగిన కోపల్లి కోఠారి సత్య – కారం సత్యవతి వ్యవహారం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.
బ్యాంకు తనఖాలో ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చి, నాలుగు లక్షల నగదు తీసుకున్నప్పటికీ, మోసపూరిత ఒప్పందంతో బాధితురాలు కారం సుబ్బలక్ష్మి ని తప్పు పట్టే ప్రయత్నం చేసిన ఘటనలో బాధితురాలు న్యాయం కోసం జనసేన వీరమహిళలను ఆశ్రయించిందని పేర్కొన్నారు. బాధిత రాలు దళిత గిరిజన మహిళ కావడం తో వీరమహిళలు ముందుకు వచ్చి పోలీసు కేసులు నమోదు చేయించగా, అటు కొందరు స్వంత పార్టీ నాయకులు మోసగాళ్లు పక్షాన నిలుస్తూ వీరమహిళలను మానసికంగా వేధిస్తున్నారని బొట్టు లీలా ఆరోపిస్తున్నారు.
ఎస్పీని కలిసి పిర్యాదు చేయడంతో పోలీసు శాఖ స్పందించి చర్యలు ప్రారంభించిందని, ఎస్పీ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.జనసేన పార్టీ స్థాపన నుంచే పవన్ కళ్యాణ్ “న్యాయం, ప్రజాస్వామ్యం, బాధితుల పక్షాన నిలబడటం” అనే సూత్రాలను ప్రధానంగా ఉంచారు. కానీ ఇప్పుడు అదే సూత్రాలను ఆచరిస్తున్న క్షేత్రస్థాయి మహిళా నాయకులు, కార్యకర్తలు స్వంత పార్టీలోనే అణచివేతకు గురవుతున్నారనే వాస్తవం ఆందోళన కలిగిస్తోందని బొట్టు లీలా తెలిపారు.
జనసేన అధినేత ప్రజా న్యాయం కోసం నిరంతరం పోరాడుతుంటే, స్థానిక నాయకులు మాత్రం వ్యక్తిగత స్వార్ధం, పదవీ ప్రాధాన్యత, వర్గీయత ఆధారంగా వ్యవహరిస్తున్నారనే విషయం సుష్పష్టం అవుతుందని అన్నారు.
ఇది పార్టీ అంతర్గత బలహీనతలతో పాటు పారదర్శక వ్యవస్థ లోపం ను బయటపెడుతోందని పేర్కొన్నారు.
జనసేన మహిళా విభాగం గత ఎన్నికల్లో పార్టీకి మంచి బలాన్ని అందించిందని
వీరమహిళల త్యాగం, కృషి, సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పార్టీకి వారు “కూరలో కరివేపాకు”లా కాకుండా, అడుగడుగునా కట్టుబాటు చూపిన శక్తి వనరులు అనే విషయాన్ని కాకినాడ నాయకులు విష్మరించడం దురదృష్టం అన్నారు.
ఇప్పుడు అదే వీరమహిళలు పరాభవం ఎదుర్కొంటున్నాయి అంటే, అది పార్టీ భవిష్యత్తుకు హెచ్చరికగా మారుతుందని,
పార్టీ లోపల సంస్థాగత సమీక్ష, అంతర్గత నియంత్రణ వ్యవస్థ, మహిళా రక్షణ కమిటీలు లాంటి చర్యలు లేకుండా ఉంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని పార్టీ అధిష్టనం గుర్తించి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
ఇది కేవలం ఒక మహిళా కార్యకర్త బాధ మాత్రమే కాదని పార్టీ విలువలపై నమ్మకం కోల్పోయే దిశలో తీసుకెళ్లే సంకేతమన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను ఆచరించే వీరమహిళలు, స్థానిక నాయకుల అన్యాయానికి ఎదురు నిలుస్తున్నందుకే ఇబ్బందులు పడుతున్నారని,
పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఈ మహిళలు ఇప్పుడు పార్టీ లోపలే పరాయి బలహీనులు గా మారడం, జనసేన భవిష్యత్తుకు సవాల్‌గా మారుతోందని,
న్యాయం కోరేవారిని మద్దతు ఇవ్వకుండా, వారిని నిరుత్సాహపరిస్తే — జనసేన ఆత్మ, ఆవేశం రెండూ దెబ్బతింటాయని హేచ్చరించారు. .భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారుతుందని పదవులు అనుభవిస్తున్న వలస పక్షులు అందిన కాడికి మూట గట్టుకుని ఎగిరి పోతాయానే నగ్న సత్యం ఆవిష్కరణ అవుతుందని వీరమహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బోడపాటి మరియ, పలువురు గిరిజన యువకులు, మహిళలు పాల్గొన్నారు.

ఆరాచకాన్ని ప్రోత్సాహిస్తున్న జనసేన నాయకులు… స్వంత పార్టీ నాయకుల చేతుల్లోనే పరాభవం ఎదుర్కొంటున్న వీరమహిళలు.. కోపల్లి కోఠారి సత్య పై ఎస్పీ కి పిర్యాదు..
కాకినాడ జిల్లా, కాకినాడ: న్యాయం కోసం కృషి చేసే వారే నేటి పరిస్థితుల్లో నిందితులుగా మారుతున్నారు. ప్రజా సమస్యలు ఎత్తిచూపి, బాధితులకు అండగా నిలుస్తే “ఆరాచకం” అంటూ విమర్శల వర్షం కురుస్తోంది. ఇటువంటి పరిస్థితులను ఇప్పుడు కాకినాడలోని జనసేన పార్టీకి చెందిన వీరమహిళలు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ 19వ డివిజన్ ఇన్‌చార్జ్ బొట్టు లీలా ఆవేదన వ్యక్తం చేస్తూ తాము పవన్ కళ్యాణ్ సిద్దాంతాలకు కట్టుబడి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే,తమ స్వంత పార్టీ నాయకులే అడ్డుపడుతున్నారని ఇది నిరాశకు గురిచేస్తోందని ఆమె ఆక్రోధన వ్యక్తం చేసారు ఇటీవల జరిగిన కోపల్లి కోఠారి సత్య – కారం సత్యవతి వ్యవహారం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. బ్యాంకు తనఖాలో ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చి, నాలుగు లక్షల నగదు తీసుకున్నప్పటికీ, మోసపూరిత ఒప్పందంతో బాధితురాలు కారం సుబ్బలక్ష్మి ని తప్పు పట్టే ప్రయత్నం చేసిన ఘటనలో బాధితురాలు న్యాయం కోసం జనసేన వీరమహిళలను ఆశ్రయించిందని పేర్కొన్నారు. బాధిత రాలు దళిత గిరిజన మహిళ కావడం తో వీరమహిళలు ముందుకు వచ్చి పోలీసు కేసులు నమోదు చేయించగా, అటు కొందరు స్వంత పార్టీ నాయకులు మోసగాళ్లు పక్షాన నిలుస్తూ వీరమహిళలను మానసికంగా వేధిస్తున్నారని బొట్టు లీలా ఆరోపిస్తున్నారు. ఎస్పీని కలిసి పిర్యాదు చేయడంతో పోలీసు శాఖ స్పందించి చర్యలు ప్రారంభించిందని, ఎస్పీ హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.జనసేన పార్టీ స్థాపన నుంచే పవన్ కళ్యాణ్ “న్యాయం, ప్రజాస్వామ్యం, బాధితుల పక్షాన నిలబడటం” అనే సూత్రాలను ప్రధానంగా ఉంచారు. కానీ ఇప్పుడు అదే సూత్రాలను ఆచరిస్తున్న క్షేత్రస్థాయి మహిళా నాయకులు, కార్యకర్తలు స్వంత పార్టీలోనే అణచివేతకు గురవుతున్నారనే వాస్తవం ఆందోళన కలిగిస్తోందని బొట్టు లీలా తెలిపారు. జనసేన అధినేత ప్రజా న్యాయం కోసం నిరంతరం పోరాడుతుంటే, స్థానిక నాయకులు మాత్రం వ్యక్తిగత స్వార్ధం, పదవీ ప్రాధాన్యత, వర్గీయత ఆధారంగా వ్యవహరిస్తున్నారనే విషయం సుష్పష్టం అవుతుందని అన్నారు. ఇది పార్టీ అంతర్గత బలహీనతలతో పాటు పారదర్శక వ్యవస్థ లోపం ను బయటపెడుతోందని పేర్కొన్నారు. జనసేన మహిళా విభాగం గత ఎన్నికల్లో పార్టీకి మంచి బలాన్ని అందించిందని వీరమహిళల త్యాగం, కృషి, సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పార్టీకి వారు “కూరలో కరివేపాకు”లా కాకుండా, అడుగడుగునా కట్టుబాటు చూపిన శక్తి వనరులు అనే విషయాన్ని కాకినాడ నాయకులు విష్మరించడం దురదృష్టం అన్నారు. ఇప్పుడు అదే వీరమహిళలు పరాభవం ఎదుర్కొంటున్నాయి అంటే, అది పార్టీ భవిష్యత్తుకు హెచ్చరికగా మారుతుందని, పార్టీ లోపల సంస్థాగత సమీక్ష, అంతర్గత నియంత్రణ వ్యవస్థ, మహిళా రక్షణ కమిటీలు లాంటి చర్యలు లేకుండా ఉంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని పార్టీ అధిష్టనం గుర్తించి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. ఇది కేవలం ఒక మహిళా కార్యకర్త బాధ మాత్రమే కాదని పార్టీ విలువలపై నమ్మకం కోల్పోయే దిశలో తీసుకెళ్లే సంకేతమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలను ఆచరించే వీరమహిళలు, స్థానిక నాయకుల అన్యాయానికి ఎదురు నిలుస్తున్నందుకే ఇబ్బందులు పడుతున్నారని, పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఈ మహిళలు ఇప్పుడు పార్టీ లోపలే పరాయి బలహీనులు గా మారడం, జనసేన భవిష్యత్తుకు సవాల్‌గా మారుతోందని, న్యాయం కోరేవారిని మద్దతు ఇవ్వకుండా, వారిని నిరుత్సాహపరిస్తే — జనసేన ఆత్మ, ఆవేశం రెండూ దెబ్బతింటాయని హేచ్చరించారు. .భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారుతుందని పదవులు అనుభవిస్తున్న వలస పక్షులు అందిన కాడికి మూట గట్టుకుని ఎగిరి పోతాయానే నగ్న సత్యం ఆవిష్కరణ అవుతుందని వీరమహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోడపాటి మరియ, పలువురు గిరిజన యువకులు, మహిళలు పాల్గొన్నారు.

