అలంపూర్ : పున్నమి ప్రతినిధి
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం మళ్లీతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో రైతువేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిచారించాయన్నారు. ఈ పంట సాగు వల్ల క్రిమిసంహారక మందుల వినియోగం 90 శాతం పైనే తగ్గిపోతుందని, దాంతో వాతావరణ కాలుష్యం భూసారం తగ్గిపోవడం వంటి అనేక అవరోధాలు తొలగిపోతాయన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పామ్ ఆయిల్ దిగుమతి కోసం ఏటా 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందని, ఆ ఖర్చును ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ అందిస్తే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రైతులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి ఆర్టికల్చర్ ఆఫీసర్లు మహేష్,రాజశేఖర్ మండల అధికారి జనార్ధన్, ఫీల్డ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, మంజునాథ్, మేఘ రెడ్డి, శివకుమార్,శశిధర్ సింగిల్ విండో కార్యదర్శి మల్లేష్, సిబ్బంది జీవన్, శ్రీనివాస్,మహేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు.
అలంపూర్ : పున్నమి ప్రతినిధి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఆయిల్ ఫామ్ సాగు వైపు రైతాంగం మళ్లీతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి అక్బర్ అన్నారు. మంగళవారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో రైతువేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిచారించాయన్నారు. ఈ పంట సాగు వల్ల క్రిమిసంహారక మందుల వినియోగం 90 శాతం పైనే తగ్గిపోతుందని, దాంతో వాతావరణ కాలుష్యం భూసారం తగ్గిపోవడం వంటి అనేక అవరోధాలు తొలగిపోతాయన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పామ్ ఆయిల్ దిగుమతి కోసం ఏటా 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుందని, ఆ ఖర్చును ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ అందిస్తే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ది పొందే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రైతులను ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివనాగిరెడ్డి ఆర్టికల్చర్ ఆఫీసర్లు మహేష్,రాజశేఖర్ మండల అధికారి జనార్ధన్, ఫీల్డ్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, మంజునాథ్, మేఘ రెడ్డి, శివకుమార్,శశిధర్ సింగిల్ విండో కార్యదర్శి మల్లేష్, సిబ్బంది జీవన్, శ్రీనివాస్,మహేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

