నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పిల్లల భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు “ఆపరేషన్ చిన్నారి తల్లి” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో శక్తి బృందాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. “సురక్షిత బాల్యం – స్థిరమైన అభివృద్ధి” అనే నినాదంతో పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, అత్యవసర సహాయం కోసం 100, 112, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేస్తున్నారు.


