తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి), మార్చి 26:తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామానికి చెందిన కాయిత రాములు పక్షవాతంతో మృతి చెందడంతో, వారి కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. మట్టి ఖర్చులు మరియు కుటుంబ పోషణ కోసం సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవాలన్నదే మానవత ధ్యేయమని తెలిపారు. విద్య, వైద్య సేవల కోసం సంస్థ అధికంగా ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ, రామన శ్రీనివాస్, వెంకటలక్ష్మి, వెలుగుబంటి రఘుకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో అండగా ‘మానవత’… పక్షవాతంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థికసాయం
తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి), మార్చి 26:తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట గ్రామానికి చెందిన కాయిత రాములు పక్షవాతంతో మృతి చెందడంతో, వారి కుటుంబానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. మట్టి ఖర్చులు మరియు కుటుంబ పోషణ కోసం సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి ఒక్క కన్నీటి బొట్టునైనా తుడవాలన్నదే మానవత ధ్యేయమని తెలిపారు. విద్య, వైద్య సేవల కోసం సంస్థ అధికంగా ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తగిన సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, ఇంజరపు వెంకటకృష్ణ సత్యనారాయణ, రామన శ్రీనివాస్, వెంకటలక్ష్మి, వెలుగుబంటి రఘుకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

