Monday, 23 March 2026
  • Home  
  • ఆన్లైన్ ఫ్రాడ్ పై అప్రమత్తత – డాక్టర్ M. శంకర్
- నిర్మల్

ఆన్లైన్ ఫ్రాడ్ పై అప్రమత్తత – డాక్టర్ M. శంకర్

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ రంగ నిపుణుడు డాక్టర్ M. శంకర్ ప్రధాన అతిథిగా పాల్గొని, విద్యార్థులు మరియు సిబ్బందికి సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు. డాక్టర్ శంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, పని పేరుతో మోసాలు, ట్రేడింగ్/ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఫిషింగ్, విషింగ్, సిమ్ స్వాప్, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు వంటి పద్ధతుల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వివరించారు. అమాయక ప్రజల అత్యాశను, భయాన్ని వాడుకుని మోసగాళ్లు లక్ష్యాలను చేరుకుంటున్నారని చెప్పారు. “అధిక లాభాల ఆశ వద్దు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి, OTP లేదా PIN వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు” అని సూచించారు. మోసపోయినవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడం, సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లు అలవరచుకోవడం అత్యవసరమని అన్నారు. చివరగా ఆయన “ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి రక్షించుకోగలరు — మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్ష” అని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ పాండే, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ యు రవికుమార్ డాక్టర్ పీజీ రెడ్డి, జి సుధాకర్, డాక్టర్ జే ఓం ప్రకాష్, సురేందర్, డాక్టర్, సంతోష్, డాక్టర్,నహీదా, దివ్య, డాక్టర్ కల్పన రాజయ్య, కిషన్ మరియు విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు

(పున్నమి ప్రతినిధి తేదీ 8 .10. 2025 నిర్మల్ జిల్లా)భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ రంగ నిపుణుడు డాక్టర్ M. శంకర్ ప్రధాన అతిథిగా పాల్గొని, విద్యార్థులు మరియు సిబ్బందికి సైబర్ భద్రతపై విలువైన సూచనలు అందించారు.

డాక్టర్ శంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, పని పేరుతో మోసాలు, ట్రేడింగ్/ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, ఫిషింగ్, విషింగ్, సిమ్ స్వాప్, నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు వంటి పద్ధతుల ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వివరించారు.

అమాయక ప్రజల అత్యాశను, భయాన్ని వాడుకుని మోసగాళ్లు లక్ష్యాలను చేరుకుంటున్నారని చెప్పారు. “అధిక లాభాల ఆశ వద్దు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి, OTP లేదా PIN వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు” అని సూచించారు.

మోసపోయినవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవడం, సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లు అలవరచుకోవడం అత్యవసరమని అన్నారు.

చివరగా ఆయన “ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి రక్షించుకోగలరు — మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్ష” అని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ పాండే, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ యు రవికుమార్ డాక్టర్ పీజీ రెడ్డి, జి సుధాకర్, డాక్టర్ జే ఓం ప్రకాష్, సురేందర్, డాక్టర్, సంతోష్, డాక్టర్,నహీదా, దివ్య, డాక్టర్ కల్పన రాజయ్య, కిషన్ మరియు విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.