చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ను కలువాయి వైద్యురాలు డాక్టర్ సరళ కుమారి (ఎంబీబీఎస్) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం అత్యంత అవసరమని,తన్విక ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ప్రజలు మరింత మెరుగైన వైద్యసేవలు పొందగలరని అన్నారు. ఫిజియోథెరపీ చికిత్సలు నేడు అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామస్థులు కూడా ఈ కేంద్రం ఏర్పాటును హర్షిస్తూ, ఇంతవరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ, ఇప్పుడు సమీపంలోనే ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందుబాటులోకి రావడం తమకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి కలువాయి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఓలేటి శ్రీనివాస్ రావు, చేజర్ల సీనియర్ టిడిపి నాయకులు రావిలక్ష్మీ నర్సారెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, రామానాయుడు,వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు,చీర్ల వెంకటేశ్వర్లు, శివ,వైసిపి నాయకులు వెంకటరత్నం తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

ఆదూరుపల్లిలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభం
చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో తన్విక ఫిజియోథెరపీ సెంటర్ ను కలువాయి వైద్యురాలు డాక్టర్ సరళ కుమారి (ఎంబీబీఎస్) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గిరి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం అత్యంత అవసరమని,తన్విక ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ప్రజలు మరింత మెరుగైన వైద్యసేవలు పొందగలరని అన్నారు. ఫిజియోథెరపీ చికిత్సలు నేడు అనేక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తున్నాయని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామస్థులు కూడా ఈ కేంద్రం ఏర్పాటును హర్షిస్తూ, ఇంతవరకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ, ఇప్పుడు సమీపంలోనే ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందుబాటులోకి రావడం తమకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు.ఈ ప్రారంభోత్సవానికి కలువాయి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఓలేటి శ్రీనివాస్ రావు, చేజర్ల సీనియర్ టిడిపి నాయకులు రావిలక్ష్మీ నర్సారెడ్డి, మోదేపల్లి పెంచలనాయుడు, రామానాయుడు,వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు,చీర్ల వెంకటేశ్వర్లు, శివ,వైసిపి నాయకులు వెంకటరత్నం తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

