ఆరోగ్యకరమైన అలవాట్లే వ్యాధులను దూరం చేస్తాయి … డాక్టర్ అడబాల మాధవి, గైనకాలజిస్ట్
(పున్నమి ప్రతినిధి) – అక్టోబర్ 23,2025, కాకినాడ.
స్థానిక ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల జాతీయ సేవా పథకం మరియు కాకినాడ ఐడిఏ సంయుక్త ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ నివారణ మరియు బాలిక ల సాధారణ సమస్యల పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు తెలిపారు.
క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలలో భాగంగా యుక్తవయస్సులో బాలికలకు రొమ్ము క్యాన్సర్ నివారణ మరియు మహిళల సాధారణ సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ నాయుడు అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా ఐ డి ఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ముఖ్యఅతిథిగా ఆత్మీయ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అడబాల మాధవి విచ్చేశారు.
అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు మాట్లాడుతూ ఈ విధమైన అవగాహన కార్యక్రమాలు చాలా అవసరమని, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలపై ప్రసంగించారు.
ముఖ్య అతిధి డాక్టర్ మాధవి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్
రొమ్ము కణజాలంలో కణాలు అసాధారణంగా మరియు అదుపులేకుండా పెరగడం వలన ఏర్పడే కణితి (గడ్డ) రొమ్ము క్యాన్సర్. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించవచ్చు అని వివరించారు వ్యాధి లక్షణాలను తెలియజేశారు. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ,హార్మోన్ థెరపీ,టార్గెటెడ్ థెరపీ వంటి అంశాలతో పాటు, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు స్త్రీ సంబంధమైన సాధారణ వ్యాధుల గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ ఎస్ ఎస్ , ఐ డి ఏ బృందాన్ని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రెటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు టి తేజేశ్వరరావు, డి అశ్విని మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.


