శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం గారికి ఆదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది.
డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసే విధంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్మార్ట్ మీటర్ల పై తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని తెలియజేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై బారానిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు అంటోని, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండలం యువజన అధ్యక్షులు ఆసిఫ్, రేణిగుంట మండలం ఓబిసి అధ్యక్షులు నగేష్, నాగరాజు, తేజ తదితరులు పాల్గొన్నారు.

ఆదాని స్మార్ట్ మీటర్లు వద్దు సాధారణ మీటర్లు ముద్దు
శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం గారికి ఆదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది. డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసే విధంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్మార్ట్ మీటర్ల పై తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై బారానిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు అంటోని, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండలం యువజన అధ్యక్షులు ఆసిఫ్, రేణిగుంట మండలం ఓబిసి అధ్యక్షులు నగేష్, నాగరాజు, తేజ తదితరులు పాల్గొన్నారు.

