Tuesday, 24 March 2026
  • Home  
  • ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.
- విశాఖపట్నం

ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు. పెదగంట్యాడ వద్ద ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రెండవ దఫా ప్రచారోద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాజువాక, మల్కాపురం ,స్టీల్ జోన్ కమిటీలు మూడు రోజులు పాటు, మూడు ఆటో జాతాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం పాత గాజువాక జంక్షన్ లో జెండా ఊపి ఆటో జాతాలను ప్రారంభించారు. దానికి ముందు ఆయన మాట్లాడుతూ, ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, ఆదాని గంగవరం పోర్ట్ కాలుష్యం అరికట్టాలని , 10 లక్షల మంది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని,గంగవరం పోర్ట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖవెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ భరత్ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో మాట్లాడి అదా నీ సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. లక్ష వరకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు .గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముందు అదానికి వత్తాసు పలికి, ప్రజలు తిరుగుబాటు చూసి మాట మార్చారు అన్నారు. ప్రజలే సుప్రీం, ప్రజా నిర్ణయం ఫైనల్ అని చెప్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చేత సిమెంట్ కంపెనీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీ ప్రమాదం తక్కువ చేసి చూపించేందుకు కొందరు కూటమినేతలు ఆదానికి ఏజెంట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదాని గంగవరం పోర్ట్ నిర్మాణ సమయంలో కూడా కాలుష్యం తక్కువ వీరు చెప్పారు.ఇప్పుడు సింధియా మొదలుకొని గాజువాక మొత్తం గంగవరం పోర్టు కాలుష్యం వెదజల్లుతున్నదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే గాజువాక అసెంబ్లీ నియోజవర్గం, విశాఖ వెస్ట్ పరిధిలో సింధియా నుండి జింక్ గేటు వరకు గల పది లక్షల మంది ప్రజల నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం గాజువాక ,మల్కాపురం జోన్ కార్యదర్శులు ఎం రాంబాబు, పి పైడిరాజు, స్టీల్ జోన్ నాయకులు నమ్మి రమణ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో అదానీ గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీసుకొని కాలుష్యాన్ని అరికడతామని ప్రస్తుతం ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు ,గణబాబులు హామీ ఇచ్చారు. దీనిని నిలబెట్టుకొని కాలుష్యాన్ని ఆపించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటు వద్దని ప్రజలు ముక్తకంఠంతో తెలియజేశారని, ప్రజాభిప్రాయం మీద కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్ను వెంటనే సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్. బంగారు నాయుడు,ఏ లోకేష్, యు సోమేశ్, అప్పల రెడ్డి,అదాని సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎన్ రామారావు, యువజన సంఘం నాయకులు కే మహేష్, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు .

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు.

పెదగంట్యాడ వద్ద ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఏర్పాటును కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. ఆదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రెండవ దఫా ప్రచారోద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాజువాక, మల్కాపురం ,స్టీల్ జోన్ కమిటీలు మూడు రోజులు పాటు, మూడు ఆటో జాతాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం పాత గాజువాక జంక్షన్ లో జెండా ఊపి ఆటో జాతాలను ప్రారంభించారు. దానికి ముందు ఆయన మాట్లాడుతూ, ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని, ఆదాని గంగవరం పోర్ట్ కాలుష్యం అరికట్టాలని , 10 లక్షల మంది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని,గంగవరం పోర్ట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖవెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ భరత్ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తో మాట్లాడి అదా నీ సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. లక్ష వరకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నామని తెలిపారు .గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముందు అదానికి వత్తాసు పలికి, ప్రజలు తిరుగుబాటు చూసి మాట మార్చారు అన్నారు. ప్రజలే సుప్రీం, ప్రజా నిర్ణయం ఫైనల్ అని చెప్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చేత సిమెంట్ కంపెనీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

సిమెంట్ కంపెనీ ప్రమాదం తక్కువ చేసి చూపించేందుకు కొందరు కూటమినేతలు ఆదానికి ఏజెంట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదాని గంగవరం పోర్ట్ నిర్మాణ సమయంలో కూడా కాలుష్యం తక్కువ వీరు చెప్పారు.ఇప్పుడు సింధియా మొదలుకొని గాజువాక మొత్తం గంగవరం పోర్టు కాలుష్యం వెదజల్లుతున్నదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు అయితే గాజువాక అసెంబ్లీ నియోజవర్గం, విశాఖ వెస్ట్ పరిధిలో సింధియా నుండి జింక్ గేటు వరకు గల పది లక్షల మంది ప్రజల నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సిపిఎం గాజువాక ,మల్కాపురం జోన్ కార్యదర్శులు ఎం రాంబాబు, పి పైడిరాజు, స్టీల్ జోన్ నాయకులు నమ్మి రమణ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో అదానీ గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీసుకొని కాలుష్యాన్ని అరికడతామని ప్రస్తుతం ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు ,గణబాబులు హామీ ఇచ్చారు. దీనిని నిలబెట్టుకొని కాలుష్యాన్ని ఆపించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదాని సిమెంట్ కంపెనీ ఏర్పాటు వద్దని ప్రజలు ముక్తకంఠంతో తెలియజేశారని, ప్రజాభిప్రాయం మీద కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్ను వెంటనే సిమెంట్ కంపెనీ ఏర్పాటును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎల్. బంగారు నాయుడు,ఏ లోకేష్, యు సోమేశ్, అప్పల రెడ్డి,అదాని సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎన్ రామారావు, యువజన సంఘం నాయకులు కే మహేష్, ఎన్ రాము తదితరులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.