భారత్ లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మాణమయ్యే బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ఉందని బిజెపి నేత మిడతల రమేష్ పేర్కొన్నరు.
*ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కాంక్షించే బడ్జెట్ ను కేంద్రం రూపొందించింది*. సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో జల రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.. బకింగ్ హోమ్ కెనాల్ ద్వారా తక్కువ రవాణా ఖర్చుతో వేగవంతంగా వాణిజ్య సరుకుల రవాణా అందుబాటులోకి వస్తుంది..
ఆంధ్రసముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి.. గంధం చెట్లు ఏర్పాటు చేయనున్నారు..
ఆంధ్రప్రదేశ్లో *అరుదైన ఖనిజాలు వెలికితీత కు ఈ బడ్జెట్ లో నిధులు* కేటాయించబడ్డాయి.. ప్రపంచ స్థాయి రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయింపు ఉంది.
అత్యంత విలువైన గంధం చెట్ల వనాలు ఏర్పాటు ద్వారా అంతరించిపోతున్న ప్రకృతి సంపద వృద్ధి లోకి రానుంది..
పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్లలో ఉన్న పరిస్థితులకు తగిన విధంగా రక్షణ రంగ బలోపేతానికి… *రక్షణ రంగ రహస్య ప్రాజెక్టులకు అధిక నిధులు* కేటాయించబడ్డాయి.. ఆత్మానిర్బర భారత్ దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని రమేష్ బడ్జెట్ పై వ్యాఖ్యానించారు…


