Thursday, 26 February 2026
  • Home  
  • ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, ప్లేట్స్ పంపిణీ
- జయశంకర్ భూపాలపల్లి

ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో విద్యార్థులకు షూస్, ప్లేట్స్ పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (పున్నమి ప్రతినిధి): ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రాంనగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు దాతల సహకారంతో షూస్ మరియు ప్లేట్స్ పంపిణీ చేశారు. ప్లేట్స్‌ను శ్రీలత బిక్షపతి గార్లు (KTK – 1 Incline) విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. గోవర్ధన్ సర్ పిల్లలకు షూస్ అవసరం ఉందని తెలియజేయడంతో దాతల సహాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గోవర్ధన్ సర్, ఉపాధ్యాయిని అపర్ణ మేడం, దాతలు మల్లేష్ గారు, సొసైటి సభ్యులు క్రాంతికుమార్, షాకీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 5 (పున్నమి ప్రతినిధి):

ఆత్మీయత సేవా సొసైటి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రాంనగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు దాతల సహకారంతో షూస్ మరియు ప్లేట్స్ పంపిణీ చేశారు. ప్లేట్స్‌ను శ్రీలత బిక్షపతి గార్లు (KTK – 1 Incline) విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్షులు బయ్యన మహేందర్ గారు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. గోవర్ధన్ సర్ పిల్లలకు షూస్ అవసరం ఉందని తెలియజేయడంతో దాతల సహాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం గోవర్ధన్ సర్, ఉపాధ్యాయిని అపర్ణ మేడం, దాతలు మల్లేష్ గారు, సొసైటి సభ్యులు క్రాంతికుమార్, షాకీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.