Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఆత్మకూరు మినీ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

Punnami Newsroom Published: Updated:
ఆత్మకూరు మినీ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

Story highlights

  • ఆత్మకూరు పట్టణంలోని మినీ బైపాస్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
  • వెంకట్రావుపల్లి, రవితేజ కళ్యాణ మండపం సమీపంలో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన బొగ్గవరపు మహాలక్ష్మి (23) మృతి చెందింది.
  • ఆమె ఆత్మకూరులోని మ్యాక్స్‌ రెడీమేడ్‌ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది.

ఆత్మకూరు పట్టణంలోని మినీ బైపాస్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకట్రావుపల్లి, రవితేజ కళ్యాణ మండపం సమీపంలో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన బొగ్గవరపు మహాలక్ష్మి (23) మృతి చెందింది. ఆమె ఆత్మకూరులోని మ్యాక్స్‌ రెడీమేడ్‌ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి ఆటోలో ఆత్మకూరు వస్తుండగా, డ్రైవర్‌ ప్రభు వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో మహాలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఆత్మకూరు ఎస్ఐ జంపాని కుమార్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. యువతీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *